King Nagarjuna : ఏయన్నార్ బయోపిక్ టాపిక్ ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చింది. తాజాగా మరోసారి ఈ ప్రస్తావన ఇఫీ వేదికగా వచ్చింది. దీనిపై నాగార్జున(King Nagarjuna) స్పందించారు. గోవాలో ఘనంగా జరుగుతున్న ఇఫీవేడుకల్లో దివంగత నటుడు ఏయన్నార్‌కు నాగార్జున నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సెంటినరీ స్పెషల్ ఏఎన్నార్: సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఈ బయోపిక్ గురించి మాట్లాడారు.
King Nagarjuna Respond..
‘ఏయన్నార్ బయోపిక్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం. ఆయన జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎదుగుదల పెరుగుతూనే పోయింది. అలాంటి దాన్ని తెరపై చూపాలంటే బోర్ కొడుతుందేమో!. ఒడుదొడుకులు చూపిేస్తనే సినిమా బాగుంటుంది. అందుకే ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలి’ అని అన్నారు.
అనంతరంనాగార్జున నటిస్తున్న చిత్రాల గురించి చెప్పుకొచ్చారు. ‘కుబేర’, ‘కూలీ’ సినిమాల్లో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు.కూలీ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. లోకేశ్ ఈతరం వారికి కావాల్సిన విధంగా సినిమాలు తీయడంలో నేర్పరి అని నాగ్ అన్నారు. అతని ఫిల్మ్ మేకింగ్ కొత్తగా ఉంటుందని కితాబిచ్చారు. ‘కుబేర’, ‘కూలీ’ రెండూ విభిన్నమైన చిత్రాలని, ప్రస్తుతం తన పాత్రల విషయంలో ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read : Ram Charan-RC16 : మైసూర్ లో మొదలైన రామ్ చరణ్ ‘ఆర్సీ 16’ షూటింగ్