కోహ్లీపై సినీ ప్రముఖుల ప్రశంసలు
King Kohli : వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ తెందూల్కర్ రికార్డును (49) బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీని సినీ ప్రముఖులు, సినిమా నిర్మాణ సంస్థలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాయి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు వెంకటేష్, ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్, చిత్ర నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, డివివి ఎంటర్ టైన్ మెంట్స్ లు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాయి.
King Kohli – ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఎవరెవరు ఎమన్నారంటే…
‘‘రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టేందుకు. కానీ, సచిన్ తెందూల్కర్ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అతడి రికార్డు బ్రేక్ చేయాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు కోహ్లీ(King Kohli) బద్దలు కొట్టాడు’’ – రాజమౌళి
‘‘ఈరోజు వాంఖడే స్టేడియంలో హిస్టరీ క్రియేట్ అయింది’’ – వెంకటేశ్
‘‘వన్డే ప్రపంచకప్‌లో 49 శతకాల తిరుగులేని రికార్డును ఓ భారతీయుడు అధిగమించాడు. అదీ భారతదేశంలో.. వరల్డ్‌కప్ సెమీ ఫైనల్‌లో! కంగ్రాట్స్ కోహ్లీ’’ – ఎన్టీఆర్
‘‘అప్పుడు ఒక దేవుడు (సచిన్), ఇప్పుడు ఓన్లీ కింగ్ (కోహ్లీ). కంగ్రాట్స్ కోహ్లీ’’ – సాయిధరమ్ తేజ్
‘‘విరాట్ కోహ్లీ. వన్డే ప్రపంచకప్‌లో ది ‘గేమ్ ఛేంజర్’’ – శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
‘‘కింగ్.. ది ‘ఓజీ’ ఆఫ్ క్రికెట్’’ – డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
50 సెంచరీల‘కింగ్’ కోహ్లీ
ముంబాయి వేదికగా న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐసిసి వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీను నమోదు చేయడం ద్వారా వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించారు. సచిన్ తెందూల్కర్ 49 సెంచరీలను రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం అనుకున్న యావత్ ప్రపంచం అంచనాలను కోహ్లీ తారుమారు చేసాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ సిరీస్ లో అందులోనూ సెమీ ఫైనల్ లో ఈ రికార్డును తిరగరాసాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజీలాండ్ 48.5 ఓవర్లలో 327కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు ఫుట్ బాల్ దిగ్గజం డేవిడ్ బెక్ హమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, సచిన్ తెందూల్కర్, ప్రముఖ హీరోలు రజనీకాంత్, జాన్ అబ్రహం, రణ్ బీర్ కపూర్, వెంకటేష్, హీరోయిన్‌లు కియారా అడ్వాణీ, అనుష్క శర్మ తదితరులు తరలివచ్చారు.
Also Read : Spark Life: పూరీ, వినాయక్ బాటలో హరీశ్ శంకర్