Kill: ఓటీటీలోనికి సూపర్‌ హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘కిల్‌’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీలోనికి సూపర్‌ హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘కిల్‌’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Hello Telugu - Kill

Kill: ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో లక్ష్‌ లాల్వానీ, తాన్య మనక్తిలా కీలక పాత్రల్లో నటించిన తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్(Kill)’. జులై 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రాణించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి ఎదురైన గట్టి పోటీని తట్టుకుని నిలబడింది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అంతలా ఆడియన్స్‌ ను కట్టిపడేస్తాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ ‘కిల్‌(Kill)’ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 6వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఎక్స్‌ వేదికగా ప్రకటన చేసింది. హిందీలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తుందా? లేదా? అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

గతేడాది నిర్వహించిన ‘టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’, ఈ ఏడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఈ మూవీలోని యాక్షన్‌ సీక్వెన్స్‌కు ఫిదా అయిన ‘జాన్‌ విక్‌’ ఫేమ్‌ ఛార్లెస్‌ ఎఫ్‌. స్టాహెల్స్కీ ఇంగ్లిష్‌ రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘కిల్ నేను ఇటీవల చూసిన అత్యంత సృజనాత్మక యాక్షన్ సినిమాల్లో ఒకటి.. వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ చిత్రం చేరువ కావాలి’ అంటూ తన ఉత్సాహం వ్యక్తం చేశారు. అమెరికాలో అమెజాన్‌ ప్రైమ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంది.

Kill – ఇంతకీ ‘కిల్‌’ కథేమిటంటే ?

అమిత్ రాఠోడ్‌ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా)ను ప్రేమిస్తాడు. అయితే, తండ్రి మాట కాదనలేక తులికా మరొకరితో నిశ్చితార్థం చేసుకోవడానికి ఒప్పుకొంటుంది. ఈ విషయం తెలిసిన అమిత్‌ ఆ ఎంగేజ్‌మెంట్‌ ను చెడగొట్టి, తులికాను తీసుకుని రైలులో రాంచీ నుంచి ఢిల్లీ బయలుదేరతాడు. ఓ స్టేషన్‌లో రైలు ఆగడంతో దాదాపు 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా, ఆమె కుటుంబం ఊహించని చిక్కుల్లో పడుతుంది. మరి ఎన్‌ఎస్‌జీ కమాండో అయిన అమిత్‌ బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు ? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా ప్రయాణికులను ఎలా కాపాడాడు? అన్నది చిత్ర కథ.

Also Read : Heeramandi: ప్రతిష్టాత్మక బుసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డులకు ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com