Kiara Advani : కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారి పోయిన కన్నడ సూపర్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ పై ఫోకస్ పెట్టాడు. తను ఎంచుకునే పాత్రపై ఉత్కంఠ పెంచేలా చేయడంలో దిట్ట. పూర్తి పర్ ఫెక్షన్ వచ్చేంత దాకా కష్టపడతాడు. అందుకే తనకు అంత స్టార్ డమ్ వచ్చింది. తను ఒక మూవీ ఒప్పుకున్నాడంటే పూర్తిగా డైరెక్టర్ కు సరెండర్ అయి పోతాడు. ఈ విషయాన్ని కేజీఎఫ్ తీసిన ప్రశాంత్ నీల్ ఒకానొక సందర్బంగా చెప్పాడు.
Kiara Advani Busy…
ప్రస్తుతం యశ్ టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ కీలకమైన ఫిమేల్ రోల్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తోంది. ఆ మధ్యన తన పాత్ర పట్ల కొంతం అసహనంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిని పటాపంచలు చేస్తూ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బెంగళూరులో ప్రత్యక్షం అయ్యింది.
టాక్సిక్ మూవీకి సంబంధించి యశ్ తో షూటింగ్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ బిజీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సీన్స్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్. ఇప్పటి దాకా హీరో యశ్ తో గోవాలో మరికొన్ని సీన్స్ తీశారు. దీనికి ముందు యశ్, కియారాపై ఓ పాట సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య దీనికి దర్శకత్వం వహించడం విశేషం. ఊ అంటావా పాటకు తనే . ఈ సాంగ్ డ్యాన్స్ కంపోజింగ్ సూపర్ అంటూ కితాబిచ్చారు.
టాక్సిక్ లో కియారాతో పాటు నయనతార, డారెల్ డిసిల్వా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా డ్రగ్ కార్టెల్ చుట్టూ తిరుగుతుందని టాక్.
Also Read : Vijay Sethupathi Shocking :ప్రాంతీయ భాషల పట్ల వివక్ష తగదు