Khushi Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లవ్లీ బ్యూటీ సమంత రుత్ ప్రభు కలిసి నటించిన ఖుషీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో ఆగస్టు 31 నుంచి ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Khushi Movie 31st August will be Released in USA
ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ తీసిన లైగర్ ఆశించిన మేర ఆడలేదు. కానీ ఖుషీ(Kushi) ఇంకా విడుదల కాకుండానే రికార్డుల మోత మోగిసింది.
నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఏకంగా రూ. 90 కోట్లు సంపాదించడం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. సంగీతం, పాటలు, హృదయాలను ఆకట్టుకునే సన్నివేశాలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఆకట్టుకునేలా చేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు మరింత ఉత్సుకతను కలుగ చేస్తున్నాయి. ఈ ఇద్దరు గతంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన మహానటిలో కలిసి నటించారు. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ ద్వారా భారీ ఎత్తున డబ్బులు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక యుఎస్ లో ఏమేరకు టికెట్లు అమ్ముడు పోతాయో వేచి చూడాలి.
Also Read : Varalaxmi Sharath Kumar : వరలక్ష్మీ శరత్ కుమార్ కు సమన్లు