Khushi Kapoor : దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను ప్రస్తుతం అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి లవ్ పాయా మూవీలో నటింంచింది. ఈ చిత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ సందర్బంగా తన పెళ్లిపై స్పందించింది. తన సోదరి జాన్వీ కపూర్ ముంబైలో ఉండదని చెప్పింది. తనకు తిరుమల శ్రీవారు అంటే చచ్చేంత ఇష్టమని తెలిపింది. చివరి దశలో తాను తిరుపతిలోనే మకాం పెడుతుందని తెలిపింది.
Khushi Kapoor Marriage Updates
తాను మాత్రం కుటుంబ పరంగా సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుంటానని ప్రకటించింది. తాను మాత్రం ఫ్యామిలీతో కలిసి ముంబైలోనే మకాం పెడతానంటూ తెలిపింది. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది.
తాను బొంబాయికి చెందిన అమ్మాయినని, తన తండ్రి బోనీ కపూర్ కూడా నా పెళ్లిని గ్రాండ్ గా జరిపించాలని కోరుకుంటున్నారని చెప్పింది ఖుషీ కపూర్. భర్తతో పాటు ఇద్దరు పిల్లలు, రెండు కుక్కలు ఉండాలనేది తన కోరిక అని, అది త్వరలోనే నెర వేరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.
మొత్తంగా ఖుషీ కపూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను ఎవరిని పెళ్లి చేసుకుంటానేది ఇప్పుడే చెప్పనంటూ సస్పెన్స్ కు తెర లేపింది.
Also Read : Beauty Pragya-Akhanda 2 : ప్రగ్యా జైశ్వాల్ ఉన్నట్టా లేనట్టా