Sridevi : భారతీయ సినీ రంగంలో మోస్ట్ ఫెవరబుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు దివంగత సినీ నటి శ్రీదేవి(Sridevi). తను ఏరికోరి అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఇద్దరికి పిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఇద్దరు ఇప్పుడు మూవీ సెక్టార్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జాన్వీ కపూర్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తను తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
Kushi Kapoor Into Sridevi Role
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరలో తారక్ తో నటించింది. ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇదే సమయంలో తాజాగా మరో మూవీలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొంటోంది . ఆ మూవీ రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ 16 . దీనికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించాడు. ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది జాన్వీ కపూర్. తాజాగా తన సోదరి ఖుషీ కపూర్(Kushi Kapoor) కూడా బిజీగా మారింది. తను లవ్ మూవీ లో నటించింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
తాజాగా మరో ఈ అమ్మడు గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు తండ్రి, నిర్మాత అయిన బోనీ కపూర్. తన తల్లి శ్రీదేవితో తాను తీసిన మామ్ సీక్వెల్ రాబోతోందని ఇప్పటికే ప్రకటించాడు. తల్లి శ్రీదేవి పాత్రలో కూతురు ఖుషీ కపూర్ నటిస్తుందని వెల్లడించాడు.
Also Read : Kannappa Love Song :లవ్లీగా కన్నప్ప లవ్ సాంగ్