Khatija Rahman : ఏఆర్ రెహమాన్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమార్తె ఖతీజా(Khatija Rahman) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైవాహిక బంధానినికి ఇటీవల స్వస్తి పలికిన రెహమాన్ .సంగీతానికి కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. రెహమాన్(AR Rahman) మ్యూజిక్‌ని మిస్ అవ్వాల్సిందేనా? అంటూ ఆయన అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై రెహమాన్ కుమార్తె స్పందించారు. ుూనాన్నపై అంవస్తున్న వార్తల్లో నిజంలేదు. ఎన్నిసార్లు చెప్పినా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అందుకే మరోసారి చెబుతున్నా. ‘దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి’’’ అని విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టు సంబంధిత వార్తను రాసిన మీడియా హౌస్‌ను ట్యాగ్ చేస్తూ అలా రాయడం సబబు కాదు’’ అని అన్నారు.
Khatija Rahman Comments
తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు రెహమాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆయనపై పలు ఊహాగానాలు వచ్చాయి. రెహమాన్ విడాకులు ప్రకటించిన రోజే ఆయన బృందంలోని ఓ బేసిస్ట్ మోహినీ డే.. తన భర్తకు విడాకులు ఇవ్వడం హాట్‌టాపిక్ అయింది. ఈ క్రమంలో వచ్చిన రూమార్స్‌ను ఆమె ఖండించారు. బాధ నుంచి కోలుకునేందుకు రెహమాన్ ఏడాదిపాటు సినిమా? నుంచి బ్రేక్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఖతీజా స్పందించారు. ప్రస్తుతం రెహమాన్ ఆర్‌సీ16కి పని చేస్తున్నారు, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమిది. జాన్వీ కపూర్ కథానాయిక.
Also Read : Sobhita Dhulipala : తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన కొత్త పెళ్ళికూతురు