బాలీవుడ్ సినీ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఖల్ నాయక్. సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ , జాకీ ష్రాఫ్ తో పాటు అందాల ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్ , అనుపమ్ ఖేర్ నటించారు.
ఖల్ నాయక్ 1993లో విడుదలై రికార్డుల మోత మోగించింది. నేటితో 30 ఏళ్లు అయ్యింది విడుదలై. ముంబై లోని సుభాష్ ఘాయ్ నివాసంలో సెలట్రేట్ చేసుకున్నారు. ఆనాటి సినిమా షూటింగ్ ముచ్చట్లు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా దర్శకుడు సుభాష్ ఘాయ్ , ముక్తా ఘాయ్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే చోటుకు చేరారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు లవ్లీ విమెన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్, భర్త శ్రీరామ్ నేనే.
1978లో సుభాష్ ఘాయ్ ముక్తా ఆర్ట్స్ ఏర్పాటై 45 ఏళ్లవుతోంది. మీరాంతా నా ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు దర్శక, నిర్మాత. ఇందులో భాగంగా గోల్డ్ మెడల్ ను పంచుకున్నారు. మీరంతా ఆదరించినందుకు మరోసారి థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు దర్శక, నిర్మాత సుఘాష్ ఘాయ్.