Priyadarshi : ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సారంగపాణి జాతకం(Sarangapani Jathakam)’. ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి(Priyadarshi) మెయిన్ లీడ్‌లో నటించగా రూప కొడువాయూర్ ఫీమేల్ లీడ్‌గా నటించింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుండగా మూవీ టీమ్ సూపర్ అప్డేట్‌ని షేర్ చేసింది.
Priyadarshi Movies
మంచిస్క్రిప్ట్‌లతో, సెన్సిబుల్ నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి పులికొండ(Priyadarshi). ప్రస్తుతం ఆయన క్లాస్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో జతకట్టి నటించిన సినిమా ‘సారంగపాణి జాతకం(Sarangapani Jathakam)’ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ టీజర్ తో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా టీజర్ ముహుర్తాన్ని నవంబర్ 21 ఉదయం 11 గంటల 12 నిమిషాలకు లాక్ చేసేశారు. ఈ సినిమాకి టాలెంటెడ్ అండ్ న్యూ మెలోడీ బ్రహ్మ ‘వివేక్ సాగర్ మ్యూజిక్’ హైలెట్ గా నిలవనుంది. టేక్నీషియన్స్ నుండి యాక్టర్స్ వరకు అందరిపై సినీ ప్రేమికులలో మంచి క్రేజ్ ఉండటంతో ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమాగా మారనుందని విశ్లేషణ.
ఈసినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రమిది. నాకు ఎప్పటి నుంచో పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా తీయాలని ఉండేది. మా సంస్థలో జంధ్యాల గారి డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ, కుదరలేదు. ఆయన మా సంస్థలో రెండు విజయవంతమైన చిత్రాలు ‘చిన్నోడు – పెద్దోడు’, ‘ఆదిత్య 369’ సినిమాలకు డైలాగ్స్ రాశారు కానీ, సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు ఇన్నేళ్లకు భర్తీ అయ్యింది. మా సంస్థలో రెండు విజయవంతమైన సినిమాలు తీసిన మోహనకృష్ణ ఇంద్రగంటి పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయడం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఖర్చు పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా చేస్తున్నాం ” అని చెప్పారు. ఇక ప్రియదర్శి నెక్స్ట్ నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఒక కోర్ట్ రూమ్ డ్రామా ద్వారా తెర ముందుకు రానున్నాడు.
Also Read : Sandeep Reddy Vanga : మరోసారి ‘స్పిరిట్’ సినిమా అప్డేట్ పై వ్యాఖ్యానించిన డైరెక్టర్