Drishyam 3 : ‘‘దృశ్యం-3 స్ర్కిప్టు సిద్ధమైంది. త్వరలో షూటింగ్ మొదలవనుంది. మా సినిమాను ఆధారంగా చేసుకుని వివిధ భాషల్లో రీమేక్స్ వచ్చాయి’ అని అన్నారు మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్. ఆయన కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం ‘బరోజ్ 3డి’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మోహన్‌లాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘దృశ్యం’ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘దృశ్యం’ తెరకెక్కించడానికి జీతూ జోసెఫ్ ఎంతో శ్రమించారు. కథ సిద్ధమైన తరువాత దాదాపు ఐదేళ్లపాటు ఆయన ఎంతో మంది నటీనటులను కలిశారు. ఎవరు కూడా ఈ కథని అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆశిర్వాద్ సినిమా్‌సకు చెందిన ఆంటోనీ ఫోన్ చేశారు.జీతూ జోసెఫ్ దగ్గర కథ ఉంది…వీలుంటే ఒకసారి వినమని చెప్పారు.
Drishyam 3 Movie Updates
కథవిన్న నేను వెంటనే ఓకే చేశా. అలా ‘ద్యశ్యం’ జర్నీ మొదలైంది. త్వరలోనే ‘దృశ్యం-3’ కూడా పట్టాలెక్కనుంది’ అని చెప్పారు. కాగా, ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్‌హాసన్, హిందీలో అక్షయ్ కుమార్ సేమ్ టైటిల్‌తో రిమేక్ చేశారు.
Also Read : Venu Swami : పుష్ప రాజ్ జాతకాన్ని బయటపెట్టిన వేణు స్వామి