SSMB29 Movie : మహేష్ బాబు, జక్కన్న కాంబినేషన్ సినిమాపై కీలక అప్డేట్

ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది...

Hello Telugu - SSMB29 Updates

SSMB29 : కల్కి 2898 ఏడీ తరువాత అదే రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29(SSMB29). ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్‌, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ రిలీజ్ తరువాత ఎక్కువ రోజులు ఆ సినిమా ప్రమోషన్స్ మీదే గడిపిన జక్కన్న కూడా ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీ మీదే వర్క్ చేస్తున్నారు.

SSMB29 Movie Updates

ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29(SSMB29)గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రజెంట్‌ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఎక్కువ భాగం సెట్స్‌లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేసినా… ఆ సెట్స్‌, వీఎఫ్ఎక్స్‌కు కావాల్సిన రిఫరెన్స్‌ల కోసం రియల్‌ లొకేషన్స్‌ను వెతికే పనిలో ఉన్నారు. నవంబర్ 15 లోగా లొకేషన్ల వేట పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. నవంబర్ ఎండింగ్ నుంచి లీడ్ ఆర్టిస్ట్‌లతో ఓ వర్క్‌షాప్‌ నిర్వహించే ఆలోచనలో ఉంది జక్కన్న టీమ్‌.

అడ్వంచరస్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి… ముందే ప్రతీ సీన్‌ను ప్రాక్టీస్ చేసి ఆ తరువాతే సెట్స్ మీదకు వెళ్లాలన్న ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి. అందుకే గతంలో ట్రిపులార్‌ కోసం చేసినట్టుగానే ప్రీ విజువలైజేషన్‌ టెక్నిక్‌ను కూడా వాడుతున్నారు. వర్క్‌ షాప్‌ పూర్తయిన తరువాతే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 2025 జనవరిలో ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమాలో ఇంతవరకు ట్రై చేయని డిఫరెంట్ లుక్‌ ట్రై చేస్తున్నారు మహేష్‌. ఈ సారి నేషనల్‌ లెవల్‌లో కాదు గ్లోబల్‌ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.

Also Read : Meenakshi Chaudhary : అలాంటి పాత్రలో చేయడం మీనాక్షి చౌదరి డ్రీమంట

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com