Daaku Maharaaj : బాలయ్య నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి కీలక అప్డేట్

తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు...

Hello Telugu - Daaku Maharaaj

Daaku Maharaaj : కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ(Bobby) కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మధ్య కాలంలో కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారీ నటసింహం. ఇక ‘డాకు మహారాజ్’ సినిమా ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చూడాలనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. అలా ఎదురు చూసే వారందరికీ చిత్ర టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.

Daaku Maharaaj Movie Updates

తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘డాకు ఇన్ యాక్షన్’ పేరుతో చిత్రీకరణ సమయంలోని ఒక ఫొటోని విడుదల చేశారు నిర్మాతలు. ఆ ఫొటోలో దర్శకుడు బాబీ కీలక సన్నివేశం గురించి వివరిస్తుండగా, బాలకృష్ణ శ్రద్ధగా వింటూ కనిపించారు. తన చిత్రాలలో హీరోలను సరికొత్తగా చూపించడంలో దర్శకుడు బాబీ కొల్లి దిట్ట అనే విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘డాకు మహారాజ్’లోనూ, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్నారు.

ఇటీవలవచ్చిన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్, అద్భుతమైన విజువల్స్ కట్టిపడేశాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం ఇలా ప్రతిదీ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నట్లు, టీజర్‌తోనే వాగ్దానం చేశారు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. సంచలన స్వరకర్త ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Also Read : Sai Durgha Tej : పుష్ప రాజ్ పై సాయి దుర్గా తేజ్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com