Sushant Singh Rajput : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూసి కొన్ని సంవత్సరాలు గడిచాయి. అయితే ఇప్పటికీ అతని మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు సుశాంత్ ది హత్యా? ఆత్మహత్యా? అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ నటుడి మరణంపై ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరో మరణానికి కారణమైన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆస్ట్రేలియా వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తప్పు చేశాడని చెప్పడానికి సరైన పత్రాలు లేనందున కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) జూన్ 2020లో మరణించారు. ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఇది హత్య అని పలువురు ఆరోపించారు. పోలీసులు దీనిని హై ప్రొఫైల్ కేసుగా పరిగణించారు. సుశాంత్ మరణంలో డ్రగ్స్ పాత్ర కూడా ఉందని పసిగట్టారు. దీంతో ఈ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఇందులో బార్టెల్స్ అనే ఆస్ట్రేలియన్ అరెస్టయ్యాడు. 2020 నవంబర్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ బరాటెల్స్ బార్టెల్స్ ను అరెస్టు చేసింది. అయితే కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి మహేశ్ జాధవన్.. బార్టెల్స్ పాత్రకు సంబంధించిన సరైన ఆధరాలు, రికార్డుల లేవని అభిప్రాయపడ్డారు. ‘ బారాటేల్స్ నేరస్థుడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, దీంతో వారిని విడుదల చేస్తున్నాం. ఈ ఉత్తర్వు లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) కేసుపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని న్యాయ మూర్తి తీర్పులో పేర్కొన్నారు.
Sushant Singh Rajput…
ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇది హత్యగా అనుమానిస్తున్నారు. జూన్ 13న సుశాంత్ కన్నుమూశారు. ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాయ్ పో చె, శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ, రాబ్తా, వెల్కమ్ టు న్యూ యార్క్, కేదార్నాథ్, సొంచిరియా, చిచోరే, డ్రైవ్, దిల్ బెచారా వంటి హిట్ సినిమాల్లో నటించాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. తన ట్యాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కలలు అధిరోహిస్తాడనుకున్న సుశాంత్ అనూహ్యంగా ఈ లోకాన్నే విడిచి పెట్టి వెళ్లిపోయాడు.
Also Read : Raayan OTT : ఓటీటీలో రానున్న ధనుష్ ‘రాయన్’ మూవీ