Kesari 2 : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , తమిళ సినీ రంగానికి చెందిన నటుడు ఆర్. మాధవన్ కలిసి నటించిన చిత్రం కేసరి 2(Kesari 2) . ఇది భారతీయ ఇతిహాసానికి చెందిన కథాంశంతో కూడినది కావడంతో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇద్దరు అగ్ర నటులు పోటీ పడి నటించారు. ఎవరికి వారే ప్రత్యేకత కలిగిన వారు కావడంతో అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మూవీ మేకర్స్.
Akshay Kumar – Kesari 2 Updates
ధర్మ ప్రొడక్షన్స్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ , లియో మీడియా కలెక్టివ్ కలిసి కేసరి2 తీశారు. భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణమైన భయంకరమైన సన్నివేశం జలియన్ వాలాబాగ్ మారణ హోమం . దీని ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం చేసిన ఒక వ్యక్తి ధైర్యాన్ని ప్రదర్శిస్తుందనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా జలియన్ వాలాబాగ్ మారణహోమం వెనుక ప్రధాన సూత్రధారి అయిన జనరల్ డయ్యర్‌ను అక్షయ్ కుమార్ పాత్రధారి సి శంకరన్ నాయర్ ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బాధితులను డయ్యర్ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తుండగా, కాల్పుల్లో మరణించిన శిశువులు కూడా ఉగ్రవాదులేనా అని నాయర్ దూకుడుగా అడుగుతాడు.
ఆ కాలంలో మహిళా న్యాయవాదులు తక్కువగా ఉన్న సమయంలో అనన్య పాండే పాత్ర దిల్‌రీత్ గిల్ అక్షయ్ కుమార్ పాత్రకు అసిస్టెంట్ లాయర్‌గా నటించింది. ఇక లాయర్ పాత్రలో ఆర్ మాధవన్ పోషించాడు అద్బుతంగా. కేసరి చాప్టర్ 2 మూవీకి ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్ . ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.
Also Read : Hero Nani : ఆ దర్శకుడు నన్ను మార్చేశాడు