Keerthy Suresh : తన లవ్ స్టోరీని రోజుకొక ఎపిసోడ్ రివీల్ చేస్తున్న మహానటి

కానీ ఆయన నా కోసం ఆ విధంగా చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది..

Hello Telugu - Keerthy Suresh

Keerthy Suresh : హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ఇటీవల తన చిరకాల మిత్రుడు ఆంటోనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో వీరిద్దరి పెళ్లి జరిగింది.15 ఏళ్ల ప్రేమకథను రోజుకో ఎపిసోడ్‌లాగా కీర్తి(Keerthy Suresh) పంచుకుంటున్నారు. బేబీజాన్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్‌ పద్థతి గురించి మాట్లాడుతూ.. ఆంటోనీ కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఆ సంప్రదాయం లో పెళ్లి చేసుకున్నామన్నారు. ‘‘క్రిస్టియన్‌ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక మా నాన్నతో మాట్లాడాను. ‘నాన్నా.. ఈ సంప్రదాయం ప్రకారం వధువును ఆమె తండ్రి పెళ్లి వేదిక పైకి తీసుకురావాలి.

నా కోసం మీరు కూడా ఆ విధంగా చేస్తారా?’ అని అడిగా. ‘తప్పకుండా చేస్తాను. మనం రెండు సంప్రదాయాల్లో వివాహం జరుపుతున్నాం. కాబట్టి నేను కూడా ఆ పద్ధతులు పాటిస్తాను’ అని ఆయన బదులిచ్చారు. ఆ మాట నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను చెప్పిన దానికి ఆయన అంగీకరిస్తారని అసలు ఊహించలేదు. కానీ ఆయన నా కోసం ఆ విధంగా చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అని కీర్తి సురేశ్‌(Keerthy Suresh) తెలిపారు.

Keerthy Suresh Reveals..

ఇటీవల బేబీజాన్‌ ఈవెంట్‌కు వెళ్లిన ఆమె పసుపుతాడు (మంగళసూత్రం)తో హాజరు కావడంపై ఆమె స్పందించారు. ‘‘దక్షిణాదిలో ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సమయంలో వధువు మెడలో వరుడు పసుపుతాడు కడతాడు. దానిని మేమెంతో పవిత్రంగా భావిస్తాం. పెళ్లైన కొన్ని రోజులకు ఒక మంచి ముహూర్తం చూసి మంగళ సూత్రాలను బంగారు చైన్‌లోకి మార్చుకుంటాం. జనవరి చివరివరకూ మంచి రోజులు లేవు. అప్పటివరకూ నేను ఎక్కడికి వెళ్లినా పసుపు తాడు తో కనిపిస్తాను’’ అని తెలిపారు. ఆంటోనీ, కీర్తి 15 ఏళ్లగా ప్రేమలో ఉన్నారు. కీర్తి కంటే అతను ఏడేళ్ల పెద్దవాడు. అందరిలాగే రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎన్నో సమస్య?ని ఎదుర్కొన్నామని కీర్తి చెప్పారు. కొవిడ్‌ సమయంలో కలిసి ఉన్నామని, 2022లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కీర్తి అన్నారు. పెద్దల అంగీకారంతో ఈ జంట డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గోవాలో పెళ్లి జరిగింది.

Also Read : Sandhya Theatre : సంధ్య థియేటర్ ఘటనపై కాసేపట్లో బన్నీ బెయిల్ పై తీర్పు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com