Keerthy Suresh: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇటీవల క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, సినీ ప్రముఖులు, శాస్త్రవేత్తల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్ లకు సక్సెస్ రేట్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎలా ఎదిగారు ? ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందం, విషాద ఘటనల నేపథ్యంలో ఈ బయోపిక్ తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు సిద్ధపడినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రను పోషించడానికి సరైన నటికోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
Keerthy Suresh Movies
మహానటి సావిత్ర జీవిత కథ అధారంగా 2018లో తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేష్(Keerthy Suresh). అంతేకాదు ‘మహానటి’ సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా లతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్… తాజాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించనున్నారని భోగట్టా. ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రని కీర్తీ సురేష్ పోషించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందని… వారికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ బయోపిక్ కు సంబంధించిన పూర్తి వివరాలనున అతి త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. కాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి 2004 డిసెంబరు 11న తుది శ్వాస విడిచారు.
Also Read : Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు అస్వస్థత ! కేడీ ఆస్పత్రికి తరలింపు !