Keerthy Suresh : తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి కాలమే సమాధానం చెప్తుందంటున్న మహానటి

వర్క్‌ లైఫ్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా...

Hello Telugu - Keerthy Suresh

Keerthy Suresh : ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఆమె తనదైన శైలిలో జవాబు ఇస్తూనే ఉంది. తాజాగా మరోసారి పెళ్లి గురించి స్పందించింది. ‘‘ ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అని నా భావన’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘ సింగిల్‌గా ఉంటున్నారు. బోర్‌గా అనిపించడం లేదా?’ అని ప్రశ్నించగా ‘‘సింగిల్‌ అని నేను చెప్పలేదుగా’’ అని నవ్వుతూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో కీర్తిసురేశ్‌(Keerthy Suresh)రిలేషన్‌లో ఉన్నారని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. పరోక్షంగా ఆమె అదే విషయాన్ని చెప్పిందనుకుంటున్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ కెరీర్‌ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని కీర్తి సురేశ్‌ చెప్పారు. తాను నటించిన చిత్రాలు పరాజయం పొందాయని.. దాంతో చాలామంది తనని విపరీతంగా విమర్శించారని ఆమె అన్నారు. వారి మాటల వల కొన్ని సందర్భాలో మనసుకు ఎంతో బాధగా ఉండేదని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పారు. రిలేషన్ షిప్‌ గురించి చెబుతూ తాను సింగిల్‌ కాదన్నారు. ‘

Keerthy Suresh Comment

‘వర్క్‌ లైఫ్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నా. కెరీర్‌ ఆరంభంలో నేను యాక్ట్‌ చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. నాకు తెలిసి అత్యధిక ట్రోల్స్‌ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే. ‘ మహానటి’ తర్వాత నాపై ట్రోల్స్‌ తగ్గాయి. విమర్శలను నేనూ స్వాగతిస్తా. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. కానీ, కొంతమంది కావాలని నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఎక్కడా రియాక్ట్‌ కాను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తాను’’ అని కీర్తిసురేష్‌(Keerthy Suresh) అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. సుమన్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. మరోవైపు, ఆమె ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read : Mokshagna Tej : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాకు ముహూర్తం ఖరారు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com