Keerthi Suresh: ‘అక్క’ గా వస్తున్న ‘మహానటి’

'అక్క' గా వస్తున్న ‘మహానటి’

Hello Telugu - Keerthi Suresh

Keerthi Suresh: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా… తన నటనతో జాతీయ అవార్డు దక్కించుకుని… నిజంగానే మహానటి అని నిరూపించుకుంది మలయాళ కుట్టి కీర్తిసురేశ్‌. ఇటీవల దసరా, మామన్నన్ వంటి హిట్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కీర్తి… ప్రస్తుతం ‘సైరెన్‌’, ‘రివాల్వర్‌ రీటా’ సినిమాలతో బిజీగా ఉంది.

Keerthi Suresh As a Sister

మరోవైపు ఆమె ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మాణంలో యువ దర్శకుడు ధరమ్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించింది. రివేంజ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ తో పాటు మరో కథానాయికగా రాధికా ఆప్టే కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ కోసం కీర్తి సోమవారం ముంబయికి చేరుకుంది.

Also Read : Mansoor Ali Khan: నటుడు మన్సూర్‌ కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com