Keeda Cola: తరుణ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో చైతన్య రావు, రాగ్ మయూర్, బ్రహ్మనందం, జీవన్, రఘురామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కీడా కోలా. క్రైం, కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లతో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ.20 కోట్లకు వరకు వసూళ్ళు సంపాదించి పర్వాలేదనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ తరహాలో ఈ సినిమా రూపొందించడంతో… ఈ సినిమా రిలీజ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Keeda Cola – ఆహాలో స్ట్రీమింగ్ కానున్న కీడా కోలా
కీడా కోలా సినిమా రిలీజ్ అయి సుమారు నాలుగు వారాలు కావస్తుండటంతో… ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. డిసెంబరు రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోనికి అందుబాటులో రానున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా కీడా కోలా
డబ్బు అవసరం చాలా ఉన్న తాతా మనువడు ఓ షాప్ లో కీడా కోలా(Keeda Cola) అనే కూల్ డ్రింక్ కొనగా అందులో బొద్దింక వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఓ గ్యాంగ్ స్టర్ తరుణ్ భాస్కర్ ఎంట్రీతో వారి ఫ్లాన్ మారి కథ ఎలా మలుపులు తిరిగింది అనే తదితర సన్నివేశాలతో సినిమా రూపొందింది. రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా ప్రొడక్షన్ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కీడా కోలా సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా విజయం సాధించింది.
Also Read : KE Gnanavel Raja: దర్శకుడికి క్షమాపణ చెప్పిన కోలీవుడ్ బడా నిర్మాత