keeda Cola Collections : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది అనే జనరంజకమైన సినిమాలు తీసిన తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన మార్క్ ఉండేలా కీడా కోలా చిత్రం తీశాడు. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదరణ లభించింది. ప్రధానంగా కమెడియన్ బ్రహ్మానందం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కామెడిని డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
keeda Cola Collections Updates
ఇందులో చైతన్య రావు, రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు. అందరూ కలిసికట్టుగా కీడా కోలాను(keeda Cola) సక్సెస్ అయ్యేలా కృషి చేశారు. ప్రముఖ నటుడు దగ్గుబాటి రాణా కీడా కోలాను సమర్పించడం విశేషం.
ఈ మూవీని నవంబర్ 3న విడుదలైంది కీడా కోలా. ముందు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తరుణ్ భాస్కర్ అండ్ టీమ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విచిత్రం ఏమైటంటే చాలా గ్యాప్ తర్వాత తీశాడు డైరెక్టర్. తన ఎఫర్ట్స్ ను పూర్తిగా పెట్టాడు. దర్శకుడు భిన్నంగా ఆలోచించాడని చెప్పేందుకు ప్రధాన కారణం బ్రహ్మానందంను తీసుకోవడం.
మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు అధికారికంగా. తొలి రోజు రూ. 6.03 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.9.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు.
Also Read : Thangalaan: తూచ్ అంటున్న “తంగలాన్” సినిమా యూనిట్