KE Gnanavel Raja: ప్రముఖ తమిళ హీరో కార్తీ ను ‘పరుత్తివీరన్’ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం దర్శకుడు ఆమిర్ కు…. కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇటీవల కార్తీ 25వ సినిమా ప్రీ రిలేజ్ ఈవెంట్ పై దర్శకుడు ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా(KE Gnanavel Raja) మధ్య వివాదం నెలకొంది.
దీనితో నిర్మాత జ్ఞానవేల్ రాజా వ్యాఖ్యలపై కోలీవుడ్ కు చెందిన పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. నటుడు, దర్శకుడు సముద్రఖని అయితే జ్ఞానవేల్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఏకంగా బహిరంగ లేఖ రాసారు. ఈ నేపధ్యంలో దిగివచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా… దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పాడు.
KE Gnanavel Raja – సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ ద్వారా క్షమాపణ చెప్పిన నిర్మాత
‘‘పరుత్తివీరన్’ విషయంలో కొన్నేళ్ల నుంచి వివాదం నెలకొని ఉంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై నేను ఎప్పుడూ మాట్లాడలేదు. చిత్ర దర్శకుడు ఆమిర్‌ను అన్నగా భావించా. మొదటి నుంచి ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఆయన నాపై చేసిన ఆరోపణలు నన్నెంతో బాధించాయి. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాతోపాటు ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన చిత్ర పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టం’’ అంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో ట్వీట్ చేశారు.
నిర్మాత-దర్శకుడి మద్య చిచ్చుపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్
‘పరుత్తివీరన్’ సినిమాతో హీరో సూర్య సోదరుడు కార్తీను కోలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు ఆమిర్. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా(KE Gnanavel Raja), దర్శకుడు ఆమిర్ మధ్య అప్పట్లో వివాదం నడించింది. దీనితో దర్శకుడు ఆమిర్… బంధువుల దగ్గర నుంచి అప్పులు తీసుకువచ్చి మరీ ఆ సినిమా పూర్తి చేశాడు. దీనితో ఆ నిర్మాతతో పాటు సూర్య కుటుంబంతో దర్శకుడు ఆమిర్ కు సంబంధాలు తెగిపోయాయి.
అయితే ఇటీవల కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమిర్ మినహా కార్తీ తో పనిచేసిన అందరు దర్శకులు హాజరయ్యారు. ఈ విషయంపై ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తనకు అసలు ఆహ్వానం అందలేనిన దర్శకుడు ఆమిర్ స్పష్టం చేసారు.
ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించిన… నిర్మాత జ్ఞానవేల్ రాజా… ‘‘అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’’ అని ఆరోపణలు చేశాడు.
దీనితో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమిర్‌కు మద్దతు తెలియజేస్తూ కోలీవుడ్ దర్శకులు భారతీ రాజా, సుధా కొంగర, సముద్రఖనితోపాటు పలువురు నటీనటులు సైతం సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ఆయన వర్కింగ్ స్టైల్‌ను మెచ్చుకున్నారు.
Also Read : Rishab Shetty: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్