Kavya Thapar : ఇస్మార్ట్ లో మిస్ అయ్యా.. డబుల్ ఇస్మార్ట్ బోల్డ్ క్యారెక్టర్ చేశాను

పూరి సర్, ఛార్మి గారిని కలసి ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్ వారికి నచ్చింది...

Hello Telugu - Kavya Thapar

Kavya Thapar : ఉస్తాద్ రామ్ పోతినేని , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్ సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్(Kavya Thapar) నటించింది. డబుల్ ఇస్మార్ట్(Double Ismart) ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్(Kavya Thapar) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Kavya Thapar Comment

పూరి సర్, ఛార్మి గారిని కలసి ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్ వారికి నచ్చింది. అయితే సమయంలో ఓ చిన్న యాక్సిడెంట్ గా కారణంగా కాస్త వెయిట్ పెరిగాను. కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారు. రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గాను. పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి ఫిట్ అయ్యాను. ఇంత అద్భుతమైన కాంబినేషన్ ఉన్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలౌతున్నాను. ఇలాంటి కాంబో లో వర్క్ చేయడం చాలా థ్రిల్ ఇచ్చింది. మొద‌ట ఇస్మార్ట్ శంకర్ కి ఆడిషన్ ఇచ్చా కానీ కుదరలేదు.

ఇప్పుడు ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా వుంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా సొంతగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక యాక్టర్ గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కొరుకున్నాను. ఈ సినిమాతో అలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా ఉంది. ఈ క్యారెక్టర్ చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.

అదొక బెస్ట్ ఎక్స్ పీరియన్స్. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. సాంగ్ షూట్ లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యా. అయినా సెట్ లోకి వచ్చాను. ఛార్మి నన్ను చూసి వెంట‌నే హాస్పిటల్ కి తీసుకెళ్లి చాలా కేర్ తీసుకున్నారు. నా కారణంగా షూటింగ్ అప్సెట్ అవుతుందని చాలా బాధపడ్డాను. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిశ్చార్జ్ అయి.. నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చా మా కెమిస్ట్రీ ది బెస్ట్ వచ్చింది. టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. ఆయన లెజండరీ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ లా అనిపించింది. ఓర్పుగా ఉండటంతో పాటు చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది. సెట్‌లో చాలా కూల్‌గా ఉంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ కూడా ఉన్నారు. జీవితం పట్ల ఆయనకి ఉన్న క్లారిటీ అమెజింగ్.

ఛార్మి మేడమ్ బాస్ లేడీ. నన్ను చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. తను పవర్ హౌస్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్యాట్సప్ టు ఛార్మి గారు. డబుల్ ఇస్మార్ట్(Double Ismart) డబుల్ బ్లాక్ బస్టర్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ కి దీనికి కంపారిజన్ లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేశాను. ఆగస్ట్ 15 కోసం ఎదురు చూస్తున్నా. మార్ ముంత ఛోడ్ చింతా, స్టెప్పా మార్ నా ఫేవరేట్.

అవి నా మైండ్ నుంచి పోవడం లేదు. అలాగే క్యా లఫ్డాను కూడా ఎంజాయ్ చేశాను. మణిశర్మ గారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నా. డబుల్ ఇస్మార్ట్(Double Ismart) స్ట్రయిట్ గా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్ ఉంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా ఇదొక బ్లెస్సింగ్ లా భావిస్తున్నాను. నాకు యాక్షన్ రోల్స్ చేయాలని ఉంది. యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అలాగే అడ్వంచరస్ మూవీ చేయాలని ఉంది. గోపిచంద్ గారితో విశ్వం చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి.

Also Read : Prabhas-Wayanad : వాయనాడ్ బాధితులకు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com