Kavya Thapar: ఆశ్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్’ హీరోయిన్ బర్త్ డే వేడుకలు ! సన్యాసం ప్లాన్ ?

ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్ బర్త్ డే వేడుకలు ! సన్యాసం ప్లాన్ ?

Hello Telugu - Kavya Thapar

Kavya Thapar: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాథ్ పరిచయం చేసే హీరోయిన్లకు ఓ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’ హీరోయిన్ అయిన కావ్య థాపర్ కూడా మొదటి సినిమాతోనే మంచి సెలబ్రెటీ స్టాటస్ పొందింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీతో పూరీ జగన్నాథ్ విసుగెత్తించినప్పటికీ… ఉన్నంతలో హీరోయిన్ కావ్య థాపర్(Kavya Thapar) తన గ్లామర్ షో కాస్త ఎంటర్‌ టైన్ చేసింది. తెలుగులో ఇదివరకే పలు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు బ్రేక్ అయితే రాలేదు. తాజాగా ఈమె తన పుట్టినరోజు వేడుకల్ని అనంత్ థామ్ అనే ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Kavya Thapar Birthday..

పుట్టినరోజుని ఆశ్రమంలో చేసుకోవడం పెద్ద విశేషమేం కాదు. కాకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌కి ముందు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కావ్య థాపర్(Kavya Thapar)… తాను జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నిరోజులకే ఇలా ఆశ్రమంలో కనిపించడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలానే ఇన్ స్టాలో స్వామిజీ తనకు తండ్రి లాంటి వారు అని చెబుతూ పెద్ద క్యాప్షన్ పెట్టింది. తన గురువు అనంత్ బాబా ఆశీస్సులు తీసుకుని కావ్య థాపర్… అక్కడే ఆశ్రమంలోని అనాథలకు, మిగతా వారికి భోజనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేర్ చేసింది.

పెళ్లి చేసుకోనని చెప్పడం, కుటుంబం ఉన్నా సరే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చూస్తుంటే.. నటిగా కొన్నాళ్లపాటు చేసి, ఆ తర్వాత సన్యాసినిగా మారుతుందేమోనని అనిపిస్తుంది. తెలుగులో ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ చేసింది. అలానే గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తీస్తున్న ‘విశ్వం’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : Call Me Bae: ఢిల్లీ యువరాణి ముంబయి ప్రయాణం ఇతివృత్తంగా ‘కాల్‌ మీ బె’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com