Hero Vicky-Katrina :విక్కీ యాక్ష‌న్ క‌త్రినా రియాక్ష‌న్

ఛావా సినిమా అద్భుతమ‌ని కితాబు

Katrina : మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ త‌న‌యుడు శంభాజీ మ‌హారాజ్ విరోచిత చరిత్రాత్మ‌క గాథ‌ను తెర‌కెక్కించిన చిత్ర‌మే ఛావా. ఇది 17వ శ‌తాబ్దంలో జ‌రిగిన య‌ధార్థ ఘ‌ట‌న‌. దీనిని ఎంతో శ్ర‌మ‌కోర్చి తీశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో శంభాజీ రాజు స‌తీమ‌ణి ఏసుబాయి పాత్ర‌లో లీన‌మై న‌టించింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందే రికార్డ్ సృష్టించింది ఈ చిత్రం. ఏకంగా ప్ర‌క‌టించిన గంట లోపే 2 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఆశించిన దానికంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించింది.

Katrina Kaif Comments

ఇందులో కీల‌క‌మైన పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు విక్కీ కౌశ‌ల్, ర‌ష్మిక మంద‌న్నా. ఈ చిత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది విక్కీ కౌశ‌ల్ స‌తీమ‌ణి, ప్ర‌ముఖ న‌టిమ‌ణి క‌త్రీనా కైఫ్(Katrina). నీ న‌ట‌న అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చింది. జీవితంలో ఇలాంటి పాత్ర‌లు న‌టుల‌కు అరుదుగా ల‌భిస్తాయ‌ని పేర్కొంది.

అంతే కాకుండా త‌న‌తో పాటు ఏసుబాయి పాత్ర‌లో లీన‌మై పోయి న‌టించిందంటూ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాపై ప్ర‌శంస‌లు కురిపించింది. రియ‌ల్లీ నేచుర‌ల్ బ్యూటీ అంటూ కితాబు ఇచ్చింది. ఛావా చిత్రం కాద‌ని అది గ‌త కాల‌పు మ‌రాఠా విరోచిత గాథ‌కు ప్ర‌తిరూప‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

Also Read : సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ పై ఆస‌క్తి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com