Kash Patel : ప్రవాస భారతీయుడైన కాశ్ పటేల్ యుఎస్ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కి డైరెక్టర్ గా కొలువు తీరారు. తన నియామకం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడైతే అమెరికా చీఫ్ గా డొనాల్డ్ ట్రంప్ కొలువు తీరారో ఆనాటి నుంచే ఎవరూ ఊహించని రీతిలో కాశ్ పటేల్(Kash Patel) పేరు ప్రముఖంగా వినిపించింది. ట్రంప్ ను, ఆయన కుటుంబాన్ని, ప్రత్యేకించి అమెరికాకు వాచ్ డాగ్ లాగా పని చేస్తూ వచ్చాడు.
Kash Patel Got Good Position
అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల సందర్బంగా చోటు చేసుకున్న ప్రచారంలో అనుకోకుండా హత్యా యత్నం జరిగింది ట్రంప్ పై. ఈ సమయంలో తనను కాపాడింది, కంటికి రెప్పలా చూసుకున్నది మాత్రం కాశ్ పటేల్. తన పేరు చెబితే చాలు ప్రపంచంలోని ఉగ్రవాదులు, నేరస్తులకు, ప్రత్యేకించి ముస్లిం టెర్రరిస్టులకు భయం. తను ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే ఇక ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోరు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.
కాశ్ పటేల్ ను ప్రకటించిన వెంటనే యావత్ ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఈ సందర్బంగా జరిగిన ఎన్నిక నిర్వహించారు సెనేట్ లో. మొత్తం 100 మంది పాల్గొనగా 51 ఓట్లు కాశ్ పటేల్ నియామకంకు సంబంధించి మద్దతుగా , వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఎఫ్బీఐకి 9వ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు కాశ్ పటేల్. అమెరికన్లకు ఎవరైనా హాని తలపెడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. తను ఎవరో కాదు ప్రవాస భారతీయుడు.
Also Read : GHMC Shocking Decision :జీహెచ్ఎంసీ షాక్ తాజ్ బంజారా హోటల్ సీజ్