Kartika Muralidharan : కొన్ని సినిమాలు చూసేందుకు ఏమీ ఉండవు. కానీ దృశ్యాలకు ప్రయారిటీ ఇస్తారు దర్శక, నిర్మాతలు. ఇక టెక్నాలజీ మారినా మెలోడీ సాంగ్స్ కు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. సంగీత ప్రియులు ఎంచక్కా ఎంజాయ్ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. అందుకే ఎంత ఖర్చు అయినా సరే రొమాంటిక్ సీన్స్ పండేలా , ప్రేమను వ్యక్తం చేసేలా , హృదయాలను హత్తుకునేలా పాటలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
Kartika Muralidharan Song Viral
ఇందులో భాగంగా కొత్తగా సినిమా రూపొందుతోంది ఆకాశం దాటి వస్తావా. ఈ సినిమాకు సంబంధించి శృంగా పేరుతో ఓ బ్యూటిఫుల్ శృంగారంతో కూడిన పాటను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇది ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సీఐఏ మూవీతో మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలోకి చేరిన మలయాళ నటి కార్తీక మురళీధరన్(Kartika Muralidharan) ఇందులో కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా మెలోడీ సాంగ్ లో లీనమై పోయి నటించి మెప్పించారు. యష్ మాస్టర్ , కార్తీక కలిసి ఇందులో నటించారు.
మంచి ఫీల్ గుడ్ ఉన్న మూవీగా నిలిచి పోతుందని దర్శకుడు తెలిపాడు. సినిమా వరకు పూర్తయ్యే దశలో ఉందని, త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని అంటున్నారు. మొత్తంగా శృంగార ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Mrunal Thakur : ఆ పాత్రను మరిచి పోలేను