Sreeleela : అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషికి 3 మూవీ షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, లవ్లీ బ్యూటీ శ్రీలీల కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ చివరిసారిగా గత ఏడాది దీపావళికి విడుదలైన భూల్ భూలైయా3 లో కనిపించాడు. కీలక అప్ డేట్ ను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు.
Sreeleela-Karthis Aryan Movie Updates
ఈ వీడియో అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. మహిళా కథానాయికగా నటించింది శ్రీలీల(Sreeleela). కాగా కార్తీక్ ఆర్యన్ సరసన ఎవరు నటిస్తారనే దానిపై చాలా ఊహాగానాల తర్వాత ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.
షెహజాదా నటుడితో కలిసి లవ్లీ బ్యూటీ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. శ్రీలీల పాత్రను ప్రకటించడంతో పాటు చిత్రంలో కార్తీక్ లుక్ ను ప్రకటించడం విశేషం. దీంతో వీరిద్దరూ కలిసి నటించ బోతున్నట్లు తేలి పోయింది.
ఈ వీడియోలో గడ్డం, జుట్టుతో రాక్ స్టార్ అవతార్ లో కార్తీక్ కనిపించగా తు మేరీ జిందగీ హై అంటూ పాట పాడారు. ఒక సన్నివేశంలో కార్తీక్ తో బైక్ నడుపుతూ అతడిని కౌలిగించు కోవడం మరింత ఆసక్తిని రేపింది.
Also Read : Chhaava Big Record కలెక్షన్ల వేటలో ఛావా అరుదైన రికార్డ్