Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

ఎట్టకేలకు కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

Hellotelugu-Karthika Nair

ఎట్టకేలకు కాబోయే భర్తను పరిచయం చేసిన ‘రంగం’ బ్యూటీ

Karthika Nair : సీనియర్ నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమయిన కార్తీక నాయర్(Karthika Nair) ఎట్టకేలకు తన భర్తను ప్రపంచానికి ప్రరిచయం చేసింది. అక్కినేని నాగచైతన్యతో ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రంగం, దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ రువాత తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్ బిజినెస్ ను చూసుకుంటుంది.

సుమారు ఎనిమేళ్ళుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె పెళ్ళిపీటలెక్కనున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఎంగేజ్ మెంట్ చేసుకున్నప్పటికీ భర్త ముఖం కనిపించకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రంగం బ్యూటీకి కాబోయే భర్త ఎవరనే చర్చ జరిగింది. ఇంతలో ఆమె తల్లి రాధ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును కలిసి పెళ్ళికి ఆహ్వానం అందించడంతో ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు కన్ఫర్మ్ అయింది. అయితే ఈ రంగం బ్యూటీని చేసుకోబోయే వరుడు ఎవరు అనేది నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ గా మారింది.

Karthika Nair – తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కార్తీక

కొన్ని నెలల క్రిందట ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ షేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన కార్తీక నాయర్… తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్‌ మేనన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అతడితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించా’’ అని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరి జోడీని చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read : NTR: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘దేవర’

 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com