పెళ్ళి పీటలెక్కుతున్న టాలీవుడ్ బ్యూటీ
Karthika Nair : టాలీవుడ్ అలనాటి అందాల నటి రాధ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయిన కార్తీక నాయర్ పెళ్ళి పీటలెక్కనుంది. అక్కినేని నాగచైతన్యతో ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత తమిళంలో Ko (తెలుగులో రంగం సినిమా) తో జీవా సరసన కోలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది. రంగం సినిమా సూపర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము మూవీలో నటించింది. వెంటనే అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో’ నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీనితో ఆమె దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్ బిజినెస్ ను చూసుకుంటుంది.
Karthika Nair – సీక్రెట్ ఎంగేజ్ మెంట్… త్వరలో పెళ్ళి
గత కొంతకాలంగా ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకోవడంలో బిజీగా ఉన్న కార్తీక నాయర్(Karthika Nair)… ఇటీవలే నిశ్చితార్ధం చేసుకుంది. అయితే కాబోయే భర్త ఫేస్ కనిపించకుండా ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది. అంతేకాదు తన కుమార్తెను వేరొక కుటుంబానికి పంపిస్తున్నామంటూ తల్లి రాధ, తండ్రి రాజశేఖరన్ నాయర్ భావోద్వేగానికి గురైనట్లు పెట్టిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరగా మారాయి. అయితే కార్తీక నాయర్ పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తన కుమార్తె పెళ్ళిని కుటుంబం, సన్నిహితులు మధ్య చేయడానికి విదేశాల్లో ఏర్పాటు చేసిన అందాల నటి రాధ… ఇప్పుడు ముఖ్యమైన అతిథులను స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో భాగంగా ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన రాధ… దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఆహ్వానించినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయంపై రాధ కుటుంబం నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన అధికారికి ఎక్స్ (Twitter) అకౌంట్ లో పెట్టిన ట్వీట్ ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.
చాలా సంవత్సరాల తర్వాత రాధను చూడటం సంతోషంగా ఉంది. అంటూ కార్తీకకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్విటర్లో పోస్ట్ చేశారు.
పెళ్ళి తరువాత సినిమాలకు దూరం అయిన రాధ
రాధ పేరుతో ప్రసిద్ధి చెందిన మళయాల భామ ఉదయ చంద్రిక… తెలుగు, తమిళ భాషల్లో 250 సినిమాలకు పైగా నటించింది. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేషన్ సరసన పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రాధ అందాల నటిగా, మంచి నర్తకిగా గుర్తింపు పొందింది. మెగాస్టార్ చిరంజీవి సరసన డ్యాన్స్ చేయగల అతికొద్ది మంది హీరోయిన్స్ లో అగ్ర మొదటి రెండు స్థానాల్లో ఉంటుంది. చిరంజీవితో ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్టాయ్యాయి. అయితే ముంబైకు చెందిన రాజశేఖరన్ నాయర్ ను వివాహమాడిన తరువాత రాధ సినిమాలకు దూరం అయ్యింది. ముగ్గురు పిల్లలకు తల్లిగా తన సంసార భాధ్యతల్లో మునిగిపోయింది. అయితే తన ఇద్దరు కుమార్తెలు కార్తీక, తులసీలను హీరోయిన్లుగా పరిచయం చేసింది.
Also Read : Manushi Chhillar : పిచ్చెక్కిస్తున్న మానుషి చిల్లర్