పెళ్ళి పీటలెక్కిన రంగం బ్యూటీ
Karthika Nair : అలనాటి అందాల నటి రాధ కుమార్తె, రంగం ఫేం బ్యూటీ కార్తీక నాయర్ పెళ్ళి పీటలెక్కింది. తన భర్త రోహిత్ మేనన్ ఏడు అడుగులు నడిచి వివాహ బంధంలోనికి అడుగుపెట్టింది. ఆదివారం కేరళలో వీరి వివాహాన్ని కన్నుల పండుగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు రాధ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మరియు సినీ ప్రముఖులు హాజరయి నూతన దంపతులను ఆశ్వీరదించారు. కార్తీక నాయర్, రోహిత్ మేనన్ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరయ్యారు. అలాగే రాధ సహనటులు రాధిక, సుహాసిని, రేవతి కూడా ఈ వివాహానికి హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది.
Karthika Nair Got Married
అక్కినేని నాగచైతన్యతో ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత తమిళంలో Ko (తెలుగులో రంగం సినిమా) తో జీవా సరసన కోలీవుడ్ లో ఆరంగ్రేటం చేసింది. రంగం సినిమా సూపర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము మూవీలో నటించింది. వెంటనే అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో’ నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీనితో ఆమె దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్ బిజినెస్ ను చూసుకుంటుంది. కొన్ని నెలల క్రితం రాజీవ్ మేనన్ తో నిశ్చితార్ధం జరిగినప్పటికీ అతని ముఖం కనిపించకుండా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో కార్తీక నాయర్(Karthika Nair) కు కాబోయే భర్త ఎవరు అంటూ సస్పెన్స్ నెలకొంది. అయితే ఓ వారం పదిరోజుల క్రితం తన భర్త ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కార్తీక నాయర్… నేడు ఆయనతో వివాహ బంధంలోనికి అడుగుపెట్టింది.
Also Read : Payal Rajput: కంటతడి పెట్టిన పాయల్ రాజ్ పుత్