Karthik Subbaraj: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య… వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చా డు. సూర్య 43వ సినిమా వస్తున్న ఈ సినిమా… కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కు100వ సినిమా కావడం విశేషం.
Karthik Subbaraj Movies
తాజాగా ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో నటించడానికి సూర్య పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్… ‘లవ్… లాఫ్టర్… వార్…’ అని ఉన్న పోస్టర్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
Also Read : Rashmika Mandanna: విజయ్ దేవరకొండకు రష్మిక మందన్నా స్పెషల్ విషెస్ !