Kareena : ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురువారం అర్ధరాత్రి కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సైఫ్ భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్(Kareena). ఈ మేరకు అధికారికంగా కుటుంబం నుంచి కీలక ప్రకటన చేశారు.
Kareena Kapoor Comment..
అభిమానుల ప్రార్థనలతో తన భర్త బతికి బయట పడ్డాడని, క్షేమంగా ఉన్నారని తెలిపారు. చోరీ చేసేందుకు వచ్చిన ఆగంతకుడు ఈ దాడికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి వరకు తన భర్త సైఫ్ అలీ ఖాన్ ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేశాడన్నారు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో కత్తిపోట్లకు గురైనట్లు తెలిపారు కరీనా కపూర్.
దాడి జరిగిన సమయంలో తనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, అందరం తీవ్ర భయాందోళనకు లోనైట్లు పేర్కొన్నారు. సైఫ్ చేతికి గాయమైంది. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇంతకు మించి తాము ఏమీ చెప్పలేమని, పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు కరీనా కపూర్.
Also Read : Beauty Harsha Richhariya : మహా కుంభ మేళాలో తళుక్కుమన్న సాధ్వీ