సోషల్ మీడియాలో ఇప్పుడు తెలంగాణ జానపదాలు దుమ్ము రేపుతున్నాయి. పల్లె పదాలతో కూడిన పాటలకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా కాపోళ్ల ఇంటికాడ సాంగ్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.
ఇందులో ప్రముఖ డ్యాన్సర్ నాగదుర్గ కీలకంగా మారింది. కాపోళ్ల ఇంటికాడ సాంగ్ కు మరింత క్రేజ్ దక్కుతోంది. ఈ కొత్త పాటలో ఆమె ప్రదర్శించిన నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. చాలా మంది అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ కాపోళ్ల ఇంటికాడ పాటను కె. జ్యోతి నిర్మించారు. ఎస్ కే మదీన్ సంగీతం అందించారు. శ్రీలత పాటను రాశారు. కుమార వాగ్దేవి మనసు పెట్టి పాడారు. నాగదుర్గతో పాటు ఇంకొంత మంది ఇందులో నటించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశారు. పాటను ఎడిటింగ్ శేఖర్ చేశారు. ప్రియా రెడ్డి హెడ్ గా వ్యవహరించారు.
నివృత్తి వైబ్స్ దీనిని సమర్పించారు. మోషన్ గ్రాఫిక్స్ అండ్ అసోసియేట్ ఎడిటర్స్ వెంకట కృష్ణ, ప్రవీణ్ నిర్వహించారు. పోస్టర్ డిజైనింగ్ సాగర్ ముదిరాజ్ చేశారు.