Rishab Shetty : ఒకే ఒక్క సినిమా తనను పాన్ ఇండియా హీరోగా మార్చేసింది. ఆ హీరో ఎవరో కాదు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రిషబ్ శెట్టి. తను హీరోనే కాదు దర్శకుడు కూడా. తను తీసిన కాంతారా చిత్రం రికార్డ్ సృష్టించింది. బాక్సులు బద్దలు కొట్టింది. కాసుల వర్షం కురిపించింది. అవార్డులు, పురస్కారాలు దక్కేలా చేసింది. కంటెంట్ ఉంటే చాలు ఏ సినిమాకు ప్రమోషన్స్ అక్కర్లేదని, ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదంటారు హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి(Rishab Shetty).
Rishab Shetty New Look
సినిమా ట్రెండ్ మారింది. టెక్నాలజీ అందిపుచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందేలా తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు సినీ రంగానికి చెందిన దర్శకులు, నిర్మాతలు. కాంతారా హిట్ తో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషల్లో నటించేందుకు ఆఫర్స్ వస్తున్నాయి రిషబ్ శెట్టికి.
తాజాగా శెట్టికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవార్కర్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. జై హనుమాన్ లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు. అశ్విన్ గంగరాజు తీయబోయే కొత్త మూవీలో కూడా కన్ ఫర్మ్ అయినట్లు సమాచారం. మొత్తంగా వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రిషబ్ శెట్టి తాజాగా తన లుక్ ను మార్చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Ex CM Kiran Kumar Reddy : వైఎస్సార్ బతికున్నా విభజన ఆగేది కాదు