Kantara Chapter 1: వచ్చేసింది ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్‌ లుక్‌

వచ్చేసింది 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్‌ లుక్‌

Hello Telugu - Kantara Chapter 1

Kantara Chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా స్వీయ దర్శకత్వంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా ‘కాంతార’. చిన్న సినిమాగా థియేటర్లలోనికి వచ్చిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా… విడుదల అయిన ఐదు భాషల్లోనూ కూడా కాసుల వర్షం కురిపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు రాబట్టింది.

దీనితో ‘కాంతార’కు ముందు ప్రపంచాన్ని పరిచయం చేయడానికి దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి… ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ను తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. దీనితో ‘కాంతార’ ప్రీక్వెల్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1(Kantara Chapter 1)’ కు సంబందించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

Kantara Chapter 1 – ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ లో యోధుడి రూపంలో భయపెడుతున్న రిషబ్ శెట్టి

‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ను తెరకెక్కిస్తున్న హోంబలే ఫిలింస్… సోమవారం దీని ఫస్ట్ లుక్ వీడియోను ఇంగ్లీషుతో కలిపి మొత్తం ఏడు భాషల్లో విడుదల చేసారు. ‘కాంతార(Kantara) – ఏ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్‍లో రిషబ్ శెట్టి లుక్ బీభత్సంగా ఉంది. కండలు తిరిగిన దేహంతో గెటప్ చాలా డిఫరెంట్‍గా ఉంది. దేహమంతా రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవు జుట్టు, గడ్డంతో ఉగ్రరూపం దాల్చిన శివుడిలా రిషబ్‌ శెట్టి లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ టీజర్లో పేర్కొన్నారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ఆరంభంలో కాంతారలో శివ (రిషబ్ శెట్టి) కనిపిస్తారు. తన తండ్రి (రిషబ్ శెట్టి) మాయమైన చోటికి వెళ్లి నిలబడతాడు. అక్కడి నుంచి చంద్రుడిని చూస్తారు. అప్పుడు ఈ లెజెండ్ (రిషబ్) ఆగమనం ఉంది. వెలుతురులో అన్నీ కనిపిస్తాయంటూ ఇంగ్లిష్‍లో వాయిస్ ఓవర్ ఉంది. దీనితో ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

400 కోట్లు వసూలు చేసిన ‘కాంతారా’

హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన సినిమా ‘కాంతారా’. చిన్న సినిమాగా 2022లో విడుదల అయిన ఈ సినిమా… విడుదల అయిన ఐదు భాషల్లోనూ నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి రికార్డు సృష్టించింది. దీనితో ‘కాంతారా’ ముందు ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి… ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ సారి చిత్ర యూనిట్ మొత్తం ఏడు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

Also Read : Samantha: జ్యోతిక సినిమాకు సమంత రివ్యూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com