Kannappa : అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన కన్నప్ప(Kannappa) చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. శివుడిగా దైవిక ఆత్మను ప్రతిబింబించే కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kannappa 1st Look Updates
అక్షయ్ కుమార్ తొలిసారిగా శివుడి పాత్రలో లీనమై నటించారు. ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది కావడం విశేషం. ఇందులో పార్వతి పాత్రలో నటిస్తోంది . విష్ణు మంచు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
దీనికి తెర దించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇక తాజాగా విడుదల చేసిన కన్నప్ప పోస్టర్ లో అక్షయ్ కుమార్ జంతు ముద్రిత నడుము వస్త్రం, తెల్లటి ధోవతి ధరించి తీక్షణంగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకం పట్టుకుని ఉన్నాడు. రుద్రాక్ష పూసలు కూడా ధరించాడు.
ఈ సందర్బంగా “మూడు లోకాలను పాలించే సర్వోన్నత ప్రభువు స్వచ్ఛమైన భక్తికి తనను తాను అప్పగించుకుంటాడు.” అంటూ పేర్కొన్నారు దర్శక, నిర్మాతలు. “కన్నప్ప కోసం మహాదేవుని పవిత్ర ప్రకాశంలోకి అడుగు పెట్టడం. ఈ ఇతిహాస కథను జీవం పోయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ దైవిక ప్రయాణంలో శివుడు మనల్ని నడిపించుగాక. ఓం నమః శివాయ!” అంటూ పేర్కొన్నారు నటుడు అక్షయ్ కుమార్.
Also Read : Hero Saif Health Update : సైఫ్ భాయ్ ఆరోగ్యం సేఫ్