RC16 : కన్నడ సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Rajkumar) గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు సన. తను దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని ఆర్సీ 16 చిత్రానికి సంబంధించి షూటింగ్ లో జాయిన్ అయ్యారంటూ తీపి కబురు చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవలే తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్నారు సూపర్ స్టార్.
Kannada Super Star into RC16 Movie Shoot
ఆర్సీ16 మూవీలో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ, బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ఇటీవల సంక్రాంతి పండగ సందర్బంగా రిలీజైన గేమ్ ఛేంజర్ ఆశించిన మేర నడవలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు నిర్మాత దిల్ రాజు, నటుడు చెర్రీ.
ఇక డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర లో నటించిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఈ మూవీపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో అట్లీ దర్శకత్వం వహించే బిగ్ ప్రాజెక్టులో కూడా అల్లు అర్జున్ సరసన నటించనుందని టాక్. అయితే దీనికి సంబంధించి ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.
ఇక ఆర్సీ 16 చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు శివ రాజ్ కుమార్. ఆయనతో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలిపారు దర్శకుడు బుచ్చిబాబు సన. తను ఉప్పెన తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు ఏఆర్ రెహమాన్. తను ఇటీవల ఛావాకు అందించిన సంగీతం గుండెలను హత్తుకునేలా చేసింది.
Also Read : Super Star Congratulate – Dragon :డ్రాగన్ మూవీ టీంకు తలైవా కంగ్రాట్స్