Kanguva Movie : కంగువ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత

ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ల్లో విడుదల చేస్తాం..

Hello Telugu - Kanguva Movie

Kanguva : ‘కంగువా’ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 8 భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఎక్స్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా(Kanguva)’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు. ‘‘తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నాం. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్‌ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం. ఇది విజయవంతమవుతుందని భావిస్తున్నాం.

Kanguva  Movie Updates

ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ల్లో విడుదల చేస్తాం. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తాం’’ అని నిర్మాత జ్ఞానవేల్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత ఇటీవల గతంలోనే చెప్పారు. దీనికి పార్ట్‌ 2, 3 కథలు ఇప్పటికే సిద్థంగా ఉన్నాయని..పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.యాక్షన్ తో పాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ కథానాయిక. బాబీ దేవోల్‌ విలన్‌గా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ కీలక పాత్రధారులు.

Also Read : Devara Collections : రిలీజైన 16 రోజులకే భారీ వసూళ్లు కొల్లగొట్టిన దేవర

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com