Kanguva : దర్శకుడు సిరుత్తై శివ – హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందిన ‘కంగువా(Kanguva)’ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో అదనపు ఆట (స్పెషల్ షో)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజూ ప్రదర్శించే నాలుగు ఆటలతో పాటు అదనంగా మరో ఆట వేసేందుకు అంగీకారం తెలిపింది. అయితే, తొలి షో ఉదయం 9 గంటలకు, చివరి ఆట అర్ధరాత్రి 2 గంటల్లోపు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ ఙ్ఞానవేల్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సహా ఏకంగా పదికిపైగా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ షో ప్రదర్శనకు అనుమతివ్వాలంటూ నిర్మాణ సంస్థ చేసిన విఙ్ఞప్తికి తమిళ నాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఒక్క రోజు మాత్రమే అదనపు ఆట ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది.
Kanguva Movie Updates
ఇటీవల ఏ సినిమాకు కూడా తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. ఒక థియేటర్‌లో బెనిఫిట్ షో జరిగిన యాక్సిడెంట్ తర్వాత, తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. పెద్ద హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి వారి సినిమాలకు కూడా అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంతకు ముందు వచ్చిన విజయ్ ‘ది గోట్’ సినిమాకు మాత్రం ఉదయం 9 గంటల ఆటలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సూర్య సినిమాకు ఉదయం 9 గంటల ఆటతో పాటు రాత్రి 2 గంటల లోపు మరో ఆటను ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వడం విశేషం. అయితే, అనుమతి ఇచ్చినప్పటికీ అది ఒక్క రోజుకే పరిమితం చేయడం గమనార్హం. అలాగే ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ‘కంగువా(Kanguva)’ తొలి ఆట తెల్లవారు జామున 4 గంటలకే ప్రదర్శించనున్నారు. తమిళనాడులో మాత్రం ఇలాంటి అనుమతి లభించలేదు. ఈ ఒక్కరోజు అనుమతి ఇవ్వడానికి కూడా కారణం విజయ్ పెట్టిన పార్టీనే అని తెలుస్తోంది. ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదని, అందుకే తను పార్టీ పెట్టాల్సి వస్తుందనేలా విజయ్ చేసిన కామెంట్స్‌తో.. ఇకపై సినిమాల విషయంలో, అందులోనూ స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించే ప్రయత్నం చేస్తోంది. సూర్య ‘కంగువా’ సినిమాతో ఆ సడలింపులు మొదలయ్యాయి.
Also Read : Chiranjeevi : సత్యదేవ్ ‘జీబ్రా’ సినిమాకు ఓ మంచి ట్యాగ్ లైన్ పెట్టిన మెగాస్టార్