Kanguva : సరికొత్త కథాంశంగా తెరకెక్కిన చిత్రం కంగువ. తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని “గ్రీన్ స్టూడియో” నిర్మించింది. ఈ సినిమా కోసం సూర్య ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్, యోగి బాబు, సుదీప్ సంజీవ్ నటించారు. అలాగే నటి దిశా పఠానీ తమిళంలో తొలిసారి నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ 2021లో ప్రారంభమైంది. కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చివరి వర్క్ జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా, రజినీకాంత్ “వెట్టయన్” విడుదల కారణంగా కంగువ(Kanguva) విడుదల వాయిదా పడింది.
Kanguva Release Updates
తాజాగా కంగువ నయా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. కంగువ చిత్రాన్ని బాలల దినోత్సవం, 2024 “నవంబర్ 14″న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది. మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ “ఫైర్ సాంగ్”ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read : Gyaarah Gyaarah OTT : బాలీవుడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగు ఓటీటీలో…