Emergency Movie : తగ్గేదేలే అని ఢిల్లీలో ‘ఎమర్జెన్సీ’ పాటలు విడుదల చేసిన లేడీ డాన్

కొందరు బాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు...

Hello Telugu - Emergency Movie

Emergency : కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ సినిమా విడుదలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాకపోవడంతో సెప్టెంబర్‌ 6వ తేదీన రిలీజ్‌పై సందేహాలు కలుగుతున్నాయి. అయినప్పటికి ఢిల్లీలో సినిమా ఆడియోను రిలీజ్‌ చేశారు కంగనా. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ? ఆ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఎప్పుడు లభిస్తుంది ? ఈవిషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది . ఎమర్జెన్సీ(Emergency) సినిమా విడుదల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇంకోసారి కూడా వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. సెప్టెంబర్‌ 6వ తేదీన సినిమా రిలీజ్‌కు కంగనా ప్లాన్‌ చేశారు.. కాని ఆ రోజు కూడా విడుదలపై సందేహాలు కలుగుతున్నాయి.

కొందరు బాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సినిమా థియేటర్ల యాజమానులను బెదిరిస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీ(Emergency) సినిమాకు సెన్సార్‌ బోర్డు ఇప్పటివరకు పర్మిషన్‌ ఇవ్వలేదు.. దీని వెనుక కుట్ర ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా సినిమాను విడుదల చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్‌ 6వ తేదీ లోగా సెన్సార్‌ సర్టిఫికేట్‌ లభిస్తుందన్న ఆశతో కంగనా ఉన్నారు. అందుకే ఢిల్లీలో ఆడియోను కూడా రిలీజ్‌ చేశారు. ప్రధానమంత్రి సినిమా సంగ్రహాలయలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో ప్రతి పాట అద్భుతంగా ఉంటుందన్నారు కంగనా.

Emergency Movie Updates

‘ఈ సినిమా లోని ప్రతి పాటను సీన్స్‌ తోనే షూట్‌ చేశాం.. ప్రతి పాటలో మ్యూజికల్‌ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ప్రతి సీన్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి పాట మంత్రముగ్దుల్ని చేస్తుంది. సింహాసన్‌ పాటను చాలా అద్భుతంగా చిత్రీకరించారు’ అని చెప్పుకొచ్చారు ఎంపీ కంగనా. అయితే ఎమర్జెన్సీ సినిమాపై పంజాబ్‌తో పాటు , తెలంగాణ ప్రభుత్వాలకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ సినిమాను నిషేధించాలని సిక్కు సంఘాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేస్తే అంతు చూస్తామని ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూడా కంగానాను బెదిరించారు. అయితే ఈ బెదిరింపులకు భయపడేది లేదని అంటున్నారు కంగనా. ఆ పాటలో నవరసాలు ఉంటాయి.దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించారు. అంతేకాకుండా సినిమాకు కంగనా దర్శకత్వం వహించారు. అయితే సినిమాలో పలు దృశ్యాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సిక్కు సంస్థలు తమను కించపర్చే విధంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : Rajinikanth : బాలకృష్ణకు అభినందనలు తెలిపిన తలైవా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com