Kangana: భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటిరోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో అప్రకటిత నిషేధం అమలు జరిగింది. వేలాది మందిని దేశ వ్యాప్తంగా అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు. ఒక రకంగా రాచరిక పాలన కొనసాగింది. ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేయడమే కాదు చిత్రహింసలకు పాల్పడ్డారు.
Kangana Ranaut Emergency Movie Updates
ఆ తర్వాత లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో భారత దేశంలో పెను విప్లవం చోటు చేసుకుంది. నియంతృత్వంతో విర్రవీగుతూ అన్ని అధికారాలను అడ్డం పెట్టుకుని చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని ప్రజలు గద్దె నుంచి తొలగించారు. జనతా సర్కార్ కొలువు తీరింది. ఆమె జైలుకు వెళ్లింది. ఇదంతా ఆనాటి కథ. ఇది చరిత్రకు దర్పణంగా నిలిచింది.
ఈ సందర్బంగా వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కంగనా రనౌత్(Kangana) ప్రధాన పాత్రలో, దర్శకురాలిగా కొత్త పాత్రలో కొలువు తీరింది. తనే దర్శకత్వం వహిస్తూ ఎమర్జెన్సీ పేరుతో సినిమా తీసింది. దేశ వ్యాప్తంగా విడుదలైంది. ఈ తరుణంలో పంజాబ్ ప్రభుత్వం సదరు సినిమాపై నిషేధం విధించింది. సిక్కు ఆచారాలను కించ పరిచేలా ఇందులో ఉందంటూ పేర్కొంది. దీంతో తీవ్రంగా స్పందించింది కంగనా. ముందు సినిమా చూడండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అంటూ సూచించారు.
Also Read : Gowtham Vasudev Shocking : ఆ సినిమాతో నాకు సంబంధం లేదు