బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. ఆమె మోదీ సర్కార్ కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న వారిలో కీలకమైన నటిగా ఉన్నారు. తాజాగా ఖలిస్తానీ ఉద్యమంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఉన్న వారు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు.
దేశం పట్ల గౌరవం లేని వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదంటూ స్పందించారు. తాజాగా ప్రముఖ పంజాబీ సింగర్ శుభ్ ప్రీత్ సింగ్ తో పాటు దిల్జీత్ లను ఏకి పారేసింది కంగనా రనౌత్.
వక్రీకరించిన భారత దేశ పటాన్ని పంచుకోవడాన్ని తప్పు పట్టారు. అంతే కాదు ఖలిస్తాన్ వైరస్ పై దిల్జిత్ దోసాంజ్ మౌనాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా 2020లో రైతులు చేపట్టిన ఆందోళనకు బహిరంగంగా మద్దతు పలికాడు దిల్జీత్ దోసాంజే. ఆరోజే కంగనా అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. తను ఖలిస్తాన్ మద్దుతుదారుగా పేర్కొంది.
ఇదిలా ఉండగా ఖలిస్తానీ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి చంపబడ్డాడు. దీనికి భారత దేశమే కారణమంటూ కెనడా ఆరోపించింది. అక్కడ ఉన్న భారత దేశానికి చెందిన దౌత్యవేత్తను బహిష్కరించింది.