బాలీవుడ్ కు చెందిన సినీ నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో టాప్ లో ఉంటారు. ఏదో ఒక దానిపై కామెంట్ చేయడం అది ట్రోల్ కు గురి కావడం జరుగుతూ వస్తోంది.
ఈ తరుణంలో తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. నటుడు రామ్ చరణ్ , దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి సినిమా చేయాలని ఉందని స్పష్టం చేసింది. ఈ అమ్మడు తన మనసులోని మాట బయటకు చెప్పేసింది. దీంతో కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రస్తుతం తమిళంలో ప్రముఖ దర్శకుడు పి. వాసు తీసిన చంద్రముఖి -2 సీక్వెల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కంగనా తో పాటు ప్రముఖ నృత్య దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర కూడా నటిస్తుండడం విశేషం.
ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుంది నటి కంగనా రనౌత్.