Kangana Ranaut : కంగనా రనౌత్.. విలక్షణమైన నటన, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా కంగనా(Kangana Ranaut) బాలీవుడ్ చిత్రాలతో, పొలిటికల్ కామెంట్స్ తో అందరికి పరిచయమే. ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తుండగా, ఆమె మరో పోస్ట్ తో వార్తల్లో నిలిచారు. మరో వైపు దీనికి స్టార్ హీరోయిన్ సమంత కూడా మద్దతు తెలిపింది.
Kangana Ranaut Comments..
తాజాగా ఒక సోషల్ మీడియా వినియోగదారుడు “మంత్రగత్తెలకు భయపడవద్దు.. వారిని కాల్చిన వారికి భయపడండి” అంటూ పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ రిప్లైగా కంగనా(Kangana Ranaut) ఒక పోస్ట్ ని కోట్ చేసింది. ” మంత్రగత్తెలు తమ ఉన్నత స్వభావానికి, అంతర్ దృష్టికి ప్రసిద్ధి. వారు స్వేచ్ఛా స్ఫూర్తితో అనుసంధానించబడిన మహిళలు. లొంగని సంకల్ప శక్తి , హద్దులను ఛేదించాలనే అనియంత్రిత కోరికతో ఉంటారు. రహస్యంగా భయపడే పంజరంలో ఉన్నవారిని శపించబడిన వారిని బెదిరించే విచ్. ప్రతిభావంతులైన వ్యక్తులకు కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయని వారిని బూడిద చేయాలని విశ్వసిస్తారు. దుఃఖం చాలా రూపాల్లో ఉంది. అసూయ అనేది అన్నింటికంటే దయనీయమైనది. మీరు అసూయపడాలని లేదా ప్రేరణ పొందాలని ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.. కానీ తెలివిగా ఎంపిక చేసుకోండి.. ప్రేరణ పొందాలని ఎంచుకునే వారు తదుపరి ఎంపికల్లో విజయం సాధిస్తారు. పంజరాన్ని విచ్ఛిన్నం చేసి విముక్తి పొందండి. ఇలానే నేనొక మంత్రగత్తె” అని కంగనా(Kangana Ranaut) రాసుకొచ్చింది. దీనికి హీరోయిన్ సమంత మద్దతు తెలుపుతూ.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది.
ప్రస్తుతం ఆమె నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. సెన్సార్ పరంగా ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ముంబై హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్ ఇటీవల ఆదేశించింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా చిక్కులు తొలగలేదని భావిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది.
చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థ్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా సెన్సార్ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాలను పెంపొందింపజేేసలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణసంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ముంబై హైకోర్టును సంప్రదించారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్థంగా తాము ఆదేశాలని ఇవ్వలేమని తెలిపింది.
Also Read : Tagore Movie : మెగాస్టార్ ఠాగూర్ సినిమా పై సీనియర్ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు