Kangana Ranaut: విభిన్న పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రేక్షుకులను అలరించడమే కాకుండా, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్. భాతర అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ తో పాటు నాలుగు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న కంగనా… సమకాలీన రాజకీయ సమస్యపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సినిమాలు, అవార్డులు, రాజకీయాలు, సమకాలీస సమస్యలు, వ్యక్తిగత విషయాలు అని తేడా లేకుండా ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో ఉండే కంగనా… త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Kangana Ranaut Latest Update
మరో రెండు నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నానే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై కంగనా(Kangana Ranaut) ఎట్టకేలకు కంగనా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం అని… ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయినా దేశానికి సేవ చేస్తునే ఉంటాను’అంటూ తన పొలిటికల్ ఎంట్రీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ… ‘నేను నటిగా కంటే జాతీయవాదిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాను. సినిమా సెట్ నుంచే రాజకీయ పార్టీలతో పోరాడాను. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా దేశం కోసం పనిచేస్తూనే ఉంటాను. ఇవన్నీ చేయకుండా నన్ను ఎవరూ ఆపలేరు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే నాకు సరైన సమయం. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. ఈ దేశంలో నాకు అన్ని ప్రాంతాలతో మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించేవారికి రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. దీనితో కంగనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కంగనా ఎంట్రీ ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమెథీ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీకు పోటీగా స్మృతి ఇరానీను బరిలో దించిన బిజేపీ అధిష్టానం… రాహుల్ ను ఓడించి సక్సెస్ అయింది. ఈ సారి రాహుల్ ఎక్కడి నుండి పోటీ చేస్తే అక్కడ నుండి కంగనా రనౌత్(Kangana Ranaut) ను బరిలో దించబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’.
స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా(Kangana Ranaut) కనిపించనుంది. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : James Cameron: మహేశ్ బాబు సినిమా ఓపెనింగ్ కు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ?