Kangana Ranaut: కంగనా రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

కంగనా రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Hello Telugu - Kangana Ranaut

Kangana Ranaut: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షుకులను అలరించడమే కాకుండా, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భాతర అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ తో పాటు నాలుగు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది.

జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రలను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా(Kangana Ranaut)… తాజాగా “ఎమర్జెన్సీ” సినిమా రిలీజ్ డేట్ ను సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

Kangana Ranaut Comment

‘‘ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ అవుతుంది. ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ‘మణికర్ణిక’ తర్వాత నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. ఇదొక పీరియాడిక్‌ డ్రామా’’ అని కంగనా పోస్ట్ చేసింది. గతేడాది నవంబరు 24న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న కంగనా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ… తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. మొదటి షెడ్యూల్ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

Also Read : Honeymoon Express Movie : ఆర్జీవీ చేతులమీదగా విడుదల చేసిన 1st సాంగ్ ‘నిజామా’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com