Emergency : వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) ముఖ్యమైన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం భారీ జనాదరణ చూరగొంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఇటీవలే విడుదల చేశారు. సిక్కుల మనో భావాలను దెబ్బ తీసేలా ఉందని పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీని నిషేధించారు. ఇక విడుదలైన అన్ని చోట్లా ఎమర్జెన్సీని జనం ఆదరిస్తుండడం విశేషం.
Kangana Ranaut Emergency Movie Updates
ఇది భారత దేశ చరిత్రలో చోటు చేసుకున్న అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించిన ఘటనను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకురాలు. రెండో రోజు ఈ మూవీ రూ. 3.42 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 1975, 1977 మధ్య మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ విధించిన 21 నెలల ఎమర్జెన్సీ కాలాన్ని వివరిస్తుంది.
భారతదేశంలో రూ. 2.4 కోట్ల ఓపెనింగ్ తర్వాత, కంగనా రనౌత్ దర్శకత్వం వహించి, సహ-నిర్మించిన ఈ చిత్రం స్వల్ప ఆదాయాన్ని గడించింది. ఎమర్జెన్సీ శనివారం రూ. 3.42 కోట్ల నికర వసూళ్లను ఆర్జించింది, ఇది దాని ప్రారంభ రోజు కంటే 36.8 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. దీనితో దాని మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 5.92 కోట్లకు చేరుకుంది.
హిందీ మార్కెట్‌లో ఈ సినిమా ఆక్యుపెన్సీ రేటు రోజంతా మెరుగు పడింది, ఉదయం షోలలో కేవలం 5.95 శాతంతో ప్రారంభమైంది. మధ్యాహ్నం నాటికి, ఆక్యుపెన్సీ 13.99 శాతం పెరిగింది, సాయంత్రం షోలలో 20.01 శాతానికి చేరుకుంది .
Also Read : Cloud Puller-Diljit : దిల్జిత్ దోసాంజ్ పంజాబ్ 95 రిలీజ్ వాయిదా