Kangana Ranaut: జయా బచ్చన్‌ పేరు వివాదంపై కంగన కీలక వ్యాఖ్యలు !

జయా బచ్చన్‌ పేరు వివాదంపై కంగన కీలక వ్యాఖ్యలు !

Hello Telugu - Kangana Ranaut

Kangana Ranaut: పార్లమెంట్‌ లో ఇటీవల జయా బచ్చన్‌ పేరుపై నెలకొన్న వివాదాన్ని ఉద్దేశించిన నటి, ఎంపీ కంగనా రనౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా(Kangana Ranaut) మాట్లాడుతూ… ఇది చాలా చిన్న విషయం అన్నారు. జయాబచ్చన్‌ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. స్త్రీ-పురుషుడు కలిస్తేనే ఒక జీవితం అందంగా ఉంటుందని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు.

‘‘ఇది అవమానకర విషయం. స్త్రీ, పురుషుల మధ్య అందమైన వ్యత్యాసాన్ని ప్రకృతి సృష్టించింది. దానిని కొందరు వివక్షగా చూస్తున్నారు. స్త్రీ, పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుంది. పార్లమెంట్‌ వేదికగా పేరు విషయంలో నెలకొన్న వివాదం చాలా చిన్న విషయం’’ అని కంగన తెలిపారు.

Kangana Ranaut Comment

అనంతరం జయాబచ్చన్‌ వైఖరిని తప్పుబడుతూ.. ‘‘ఈవిధమైన అహంకార వైఖరి ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న బంధంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. మనుషులెప్పుడూ ఒకరికొకరు కలిసి ఉండాలి. ఇలాంటి కఠిన వైఖరితో వారిని విడదీయకూడదు. మన పేరు వెనక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినంతనే కొంతమంది కోపానికి గురవుతున్నారు. తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అంతమాత్రానికే తమ గుర్తింపుపోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటివారిని చూసినప్పుడు నాకు బాధగా (వ్యంగ్యంగా) ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌… జయా బచ్చన్‌ను… ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అని సంబోధించారు. దీనిపై జయా బచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జయా బచ్చన్‌ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అని డిప్యూటీ ఛైర్మన్‌ చెప్పగా… ‘మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ ఆ రోజు ఒకింత అసహనం వ్యక్తంచేశారు.

స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో కంగనా రనౌత్‌(Kangana Ranaut) బిజీగా పాల్గొంటున్నారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని దీనిని రూపొందించారు. సెప్టెంబర్‌ 6న ఇది విడుదల కావాల్సిఉండగా.. సెన్సార్‌ సర్టిఫికేట్ ఇంకా రాకపోవడంతో రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Also Read : Megastar Chiranjeevi: టాలీవుడ్ డైరెక్టర్స్ కు మెగాస్టార్ ఛాలెంజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com